ఎంత గొప్ప దేవుడవు యేసయ్య || Beautiful Christian Song || 2023 || SOFIA GLORY || KBR Timothy

ఎంత గొప్ప దేవుడవు యేసయ్య || Beautiful Christian Song || 2023 || SOFIA GLORY || KBR Timothy


A beautiful song written and sung by Pastor KBR Timothy. Below are his few words about the song. Hope this song brings blessing as you listen to it. Praise be to God

నా పేరు. కె బి ఆర్ తిమోతి. విట్నెసెస్ మినిస్ట్రీస్ – ఆదిలాబాదు

నేను గిరిజన తెగలలోని “కొలాం” అను తెగ నుండి 1998 సంవత్సరము లో మన ప్రభువైన యేసుక్రీస్తును నా రక్షకునిగా అంగీకరించి యున్నాను
అప్పటి నుండి నేను దేవుని సన్నిధిలో నా ప్రార్థన, వాక్య ధ్యానములో వున్నప్పుడు నేను క్రీస్తులోకి
రాక మునుపు మేము పూజించిన వాటికి మరియు యేసుక్రీస్తునకు మద్య ఎంతో వ్యత్యాసమును కనుగొన్నాను
మరియు దేవుని యెుక్క గొప్పతనమును గూర్చి ఆలోచిస్తూ దేవుని వాక్యము చదువుచుండగా దేవుని గొప్పతనమునకు మితిలేదని గ్రహించియున్నాను భూమ్యాకాశములు పట్టజాలని దేవుడు హస్తకృతములైన ఆలయములలో నివసించడు అయినను మన దేహమును తన ఆలయముగా ఎన్నుకున్నాడనియు,
తరాలు యుగాలు మారుతున్నప్పటికి ఆయన మాత్రము నిన్న నేడు రేపు కూడా ఏకరీతిగా వున్నాడనియు, అన్నియు గతించును గాని ఆయన ఎల్లప్పుడు నిలుచుననియు తెలుసుకున్నాను మరియు దేవుని గూర్చి నేను వ్రాసిన పాటలలో ఈ పాట మొదటిది
ఈ పాట వ్రాయడానికి, మరియు స్వరపరచుటకు, పాడుటకు దేవుడు కృప చూపియున్నారు .

|| LYRICS ||

ఎంత గొప్ప దేవుడవు యేసయ్యా
నీవంటి దేవుడెవరు లేరయ్యా -2
దేవాది దేవుడవు ప్రభువుల ప్రభువుడవు
ఇహ పరములనేలే రాజాది రాజులు- 2

భూమ్యాకాశములు నిన్ను పట్ట జాలవు
హస్తకృత ఆలయము నిన్ను పట్ట జాలునా? -2
నాలోన వుంటనంటివి నా యేసయ్యా
నా దేహము నీ ఆలయమంటివీ -2
” దేవాది దేవుడవు”

ఆకాశము నీ సింహాసనము
ఈ భూమి ని పాద పీఠము -2
స్తుతి సింహాసనమునే కోరుకుంటివీ నా యేసయ్యా
నిత్యము నిన్ను స్తుతించెదను -2
” దేవాది దేవుడవు”

తరాలు మారిన యుగాలు మారిన
మారిన దేవుడవు ఏకరీతిగున్నావు
నీయందే నిత్యజీవము నా యేసయ్యా
యుగయుగములు నీతో నుందును
” దేవాది దేవుడవు ”

భూమ్యాకాశములు గతించి పోయినను
నీ మాటలెన్నడూ తప్పిపోవన్నావు
అతి త్వరలో వస్తానంటివీ నా యేసయ్యా
నిన్నెదుర్కొనే శక్తి నియ్యుమా
“దేవాది దేవుడవు ”

Lyrics : KBR Timothy
Vocals: Sofia Glory
Produced by: Arun Earpula
Music: Christopher
Mix and Mastering: Daya Kumar
Video Editing: Hallelujah Raju
Try Amazon Fresh

Scroll to Top