నను నీలా ప్రేమించేలా ఎవరూ లేరయ్యా.. Latest telugu christian shortfilm / video song ll 4K ll
నను నీలా ప్రేమించేలా ఎవరూ లేరయ్యా.. Latest telugu christian shortfilm / video song ll 4K ll Home recorded song – 06
Copyrights Reserved © : Any Unauthorized reproduction, redistribution or re-uploading on YouTube or other streaming engines is Strictly Prohibited. Will be given Strike.
Lyrics :
పల్లవి: నను నీలా ప్రేమించేలా
ఎవరూ లేరయ్యా
నిజ ప్రేమకు అర్థం ఉంటే
అది నీవే యేసయ్యా
నను నిత్యం చూస్తుంటావు
పలకరిస్తూ ఉంటావు,
విననొల్లని స్థితిలో ఉన్నా
ఎదురుచూస్తూ ఉంటావు.
అ.ప: అయినను ప్రేమిస్తుంటావు
అయినను కరుణిస్తుంటావు
అయినను రక్షిస్తుంటావు
(లాలిస్తుంటావు)
ఎందుకు ఇంత ప్రేమయా
నాపై ఎందుకు యేసయ్యా
1చ: నాతోనే నిత్యం వుంటూ
నేను చేసే వన్నీ చూస్తూ
నేను వెళ్లే ప్రతి స్థలముకు
నా వెంటే వస్తుంటావు
చూసి చూడనట్లుగా
క్షమియిస్తూ ఉంటావు
నీ మాటే నేను వినకపోయినా
నిన్ను నేను దాటిపోయినా
అయినను ప్రేమిస్తుంటావు
అయినను నడిపిస్తుంటావు
అయినను తోడుగ ఉంటావు
ఎందుకు ఇంత ప్రేమయా
నాపై ఎందుకు యేసయ్యా
2చర:నిన్ను దాటిపోయానయ్యా
లోకమే చాలునంటూ
లోక ప్రేమ శాశ్వతం అని
నే మోసపోయిననూ
ఏ నాడు నీ ప్రేమ
చేయి విడువలేదయ్యా
నాకు నేనే నీ వైపు చూసెదాకా
నీ ప్రేమలో సహనం చూశానయ్యా
ఓర్పుతో ఓర్చుకున్నావయ్యా
ప్రేమతో సహియించావయ్యా
దయతో పట్టించుకున్నావయ్యా
ఎందుకు ఇంత ప్రేమయా
నాపై ఎందుకు యేసయ్యా
3చర:ఏ మంచి లేని నాకు
మంచితనం చూపావయ్యా
నన్ను ప్రోత్సాహపరచి
విజయం నాకిచ్చావయ్యా
రుచి చూచి ఎరిగితినయ్యా
నీ మధుర ప్రేమను
విఫలమైన ప్రతి జీవితానికీ
నీ ప్రేమే దివ్య ఔషధం
నిన్నే ప్రకటిస్తానయ్యా
నీ ప్రేమను వివరిస్తానయ్యా
నీ సాక్షిగ నేనుంటానయ్యా
అద్భుత ప్రేమ నీదయా
నీ ప్రేమకు నేనే పత్రికను
Music & Editing – RaviPrasad
Lyrics,Tune&Vocals – Vennela
Story & Direction – Theresa
Team Members :
Baby-Vaijayanthi Sri
Sreshta
Vamsi
Surendra
Chandrika
Asha
Kiran
Seshu
John
Manjula
Sanjana
Ashwitha
Snohitha
Sreshta Creations, Vijayawada
8332852022