నేను నా ఇల్లు నా ఇంటి వారందరు|Nenu naa illu naa inti vaarandaru|Telugu Christian Devotional Song

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు|Nenu naa illu naa inti vaarandaru|Telugu Christian Devotional Song


నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించెదము

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించెదము (2)
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2)
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||

ఎడారిలో ఉన్న నా జీవితమును
మేళ్ళతో నింపితివే (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావ స్తోత్రం (2) ||ఎబినేజరే||

ఏ ఆశలే లేని నాదు బ్రతుకును
నీ కృపతో నింపితివే (2)
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||

జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యమాశ్చర్యమే (2)
నీ పాత్రను కానే కాను
కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||
Try Amazon Fresh

Scroll to Top