పంక్తిలోకి రండి…క్రిస్మస్ | Telugu Christmas Song | Prabodh Beera | Shakina Santhi Raj | Maranatha
Lyrics In Description:
పంక్తిలోకి రండి – క్రిస్మసు పంక్తిలోకి రండి క్రిస్మసు పంక్తిలోకి రండి || పంక్తి ||
1. ఎరుకపరుపలెండి – క్రిస్మసు – నెరుకపరుపలెండి క్రిస్మసు
నెరుక పరుపలెండి = వెరువకుడి శుభ – వార్త యిదియం
దర కానంద – కరమైనది మీ కొరకై రక్షకుండు – బుట్టెనని
ఎరిగించిన గబ్రి – యేలు దూత || పంక్తి ||
2. మహిమ పరుప రండి – దేవుని మహిమ పరుప రండి దేవుని
మహిమపరుపరండి = మహికిన్ దేవ కు – మారుడు వచ్చిన
మహిమకార్య స-న్మానార్ధంబై – మహిమ సంభవ – మగు దేవునికిని
మహిమగ పలికిన – మహిమ దూతల || పంక్తి ||
3. దేవప్రియులగుడి – క్రిస్మస్ దేవప్రియులగుడి – క్రిస్మస్
దేవప్రియులగుడి = దేవుని కిష్టులౌ వారలకు
ఈ వసుధను లభి – యించును శాంతి
ఈ విధముగా వచి – యించిన బుధజన
సేవకాళియగు – దేవదూతల || పంక్తి ||
4. మనసున జూడండి – బాలుని – మనసునజూడండి – బాలుని
మనసున జూడండి = జనన వార్తను వినిన వెంటనే
మనసున భీతి – యణగిన వారై
మనసా నంద – బును గలవారై
చని శిశువును చూ-చిన గొల్లల || పంక్తి ||
5. చేకొనుడి వార్త – భద్రము – చేసికొనుడి వార్త – భద్రము
చేసికొనుడివార్త = ఆ కాపరుల – యన్నిమాటలు
స్వీకరించి మది – చింతనచేయుచు
శ్రీ కరజన్మవి – శేషంబులు హృది
చేకొని భద్రము – చేసిన యామె || పంక్తి ||
6. వింతగా చూడండి శిశువును – వింతగా చూడండి =
అంత దేవుడు నరుడై వచ్చిన – వింతశిశువును – జూచుచు
మదిని – సంతస మొందుచు – నిశ్శబ్దముగ
చెంతను గూర్చుండిన – యోసేపు || పంక్తి ||
7. ఆరాధించండి – క్రీస్తును ఆరాధించండి – క్రీస్తును
ఆరాధించండి = రారాజగుని-శ్రాయేల్ రాజౌ
ఈ రాజున్న – యింటికి చుక్క
దారిచూపగా – జేరి మ్రొక్కుచు
ఆరాధించిన – తూరుపుజ్ఞానుల || పంక్తి ||
8. మనకని నమ్మండి – క్రిస్మసు – మనకని నమ్మండి – క్రిస్మసు
మనకని నమ్మండి = మనకై క్రీస్తు – మహిలో బుట్టెను
గనుక కృతజ్ఞత – గనపరచుటకై
మనసున బాహ్యమున – క్రిస్మసు
పనులు పూనుకొను – వారి సమాజ || పంక్తి ||
Try Amazon Fresh