పండూగొచ్చిoది, Pandugochindhi, Telugu Christmas song, Victor Rampogu,
#TeluguChristmasSong #ChristmasSong #VictorRampogu
పండూగొచ్చిoది, Pandugochindhi, Telugu Christmas song, Victor Rampogu,
ఈ పాట క్రీస్తు వంశావళిని వివరించు పాట. ప్రతి లైన్ కు ఒక బైబిల్ వచనం ఆధారం. వచనాలు క్రింద డిస్క్రిప్షన్లొ వెసాము.
Lyrics, Tune & Producer: Victor Rampogu (Founder & President, Vision And Mission Ministries)
Singer: Ramana
Music: Ashok M
Choreography: Shailaja Gundala
DOP & Editing: Rayudu (CCR Media)
Vision And Mission Ministries (USA)
Copyright © 2020 by Victor Rampogu
పండూగొచ్చిoది సంతోషమిచ్చినది శుభమూతెచ్చినది హ్హె హ్హె హ్హే
ఊరూ వాడ తిరిగి ఊరేగింపు చేసి ఏసూ పుట్టెనని చాటి చెప్పుదాం ఒహ్ ఒహ్ ఒహ్హో
అదిగొ యాకోబులొ నక్షత్రం మెరియుచు ఉదయించెను చూడు
ఇదిగో ఇశ్రాయేలులొ రాజు బలముతో జన్మించెను చూడు
హ్హె హ్హె హ్హె హ్హె హెహెహె ఒహ్ ఒహ్ ఒహ్ ఒహ్ ఒహ్హోహ్హో
దావీదు వంశములోనుండి – శూరుడు వెలసెను అహ చూడు
యూదయ బెత్లేహేమునుండి – పాలకుడు వచ్చెను అహ చూడు
యెష్షయి ఎండిన మొద్దు నుండి – అంకురము మొలిచెను అహ చూడు
అబ్రాము వంశావలినుండి – దీవెనలు తెచ్చెను ఒహొ చూడు
సాతానుకు నాశనమే కలిగే
ఎఫ్రాతా పరివారమునుండి – విమోచన దొరికెను ఒహొ చూడు
కన్యక గర్బములొనుండి – మనుజుడై పుట్టెను ఒహో చూడు
ఐగుప్తు దేశములోనుండి – రారాజుగ ఎదిగెను అహ చూడు
యోసేపు సంతానము నుండి – రక్షణ కలిగెను ఒహో చూడు
సాతానుకు నాశనమే కలిగే
Scripture references used for this song are printed below, each line in lyric based on the follwoing scriptures;
సంఖ్యాకాండము 24:17 “…నక్షత్రము యాకోబు లో ఉదయించును రాజదండము ఇశ్రాయేలు లోనుండి లేచును” (Number 24:17)
సంఖ్యాకాండము 24: 19. యాకోబు సంతానమున యేలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపజేయును. (Numbers 24:19)
యోహాను 7: 42. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి………..(John 7:42)
మీకా 5:2 బేత్ లెహే ము ఎఫ్రాతా , యూదా వారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; (Micah 5:2)
యెషయా 11:1. యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును (Isaiah 11:1)
మత్తయి 1:20 “… దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియ ను చేర్చు కొనుటకు భయపడకుము,…” 21. తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు 2 అను పే రు పెట్టుదువనెను (Matthew 1:20,21)
రూతు 4:12. ఎఫ్రాతా లో నీవు క్షేమాభివృద్ధి (విమోచన) కలిగినవాడవై బేత్ లెహే ములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. (Ruth 4:12)
యెషయా 7:14 ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పే రు పెట్టును (Isaiah 7:14)
మత్తయి 2:15 ఐగుప్తు నకు వెళ్లి ఐగుప్తు లోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెల విచ్చిన మాట నెరవేర్చ బడునట్లు హే రోదు మరణమువరకు అక్కడనుండెను. (Matthew 2:15)
గలతీయులకు 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమో చించెను; (Galatians 3:14)