
ఫేమస్ క్రిస్మస్ సాంగ్స్ – Telugu Christmas songs #christmasnewsongs #christiansongs

ఫేమస్ క్రిస్మస్ సాంగ్స్ – Telugu Christmas songs #christmasnewsongs #christiansongs
#jesus #christianreels #christianfaith #2024 #aiimages #bibleverseoftheday #bible #jesussong #teluguchristian #calvarytemple #christmassongs #oldchristmassongs #slowchristiansongs #telanganachristiansongs #hearttouchingteluguchristiansongs #christianpatalusongs #క్రిస్మస్సాంగ్స్ #న్యూక్రిస్ట్మాసాంగ్స్ #జీసస్సాంగ్స్ #ఆంధ్రక్రైస్తువకీర్తనలు
1st song – 0:00
వింతైన తారక వెలిసింది గగనాన
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)
జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)
మనమంతా జగమంతా
తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
ఆకాశమంతా ఆ దూతలంతా
గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే నిత్య మహిమ (2)
భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా||
ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
యేసయ్యను దర్శించిరి
ఎంతో విలువైన కానుకలను అర్పించి
రారాజును పూజించిరి (2)
హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి
అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||
2nd song – 6:39
రారే చూతము రాజ సుతుడీ రేయి జనన మాయెను
రాజులకు రారాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో (2)
” రారే చూతము ”
దూత గణములన్ దేరి జూడరే దైవ వాక్కులన్ దెల్పగా
దేవుడే మన దీన రూపున ధరణికరిగే నీ దినమున (2)
” రారే చూతము ”
కల్ల కాదిది కలియు గాదిది గొల్ల బోయల దర్శనం
తెల్ల గానదే తేజ రిల్లెడి తార గాంచను త్వరగా రారే (2)
” రారే చూతము ”
బాలుడడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు
బాల బాలిక బాల వృద్ధుల నేల గల్గిన నాధుడు (2)
” రారే చూతము ”
3rd song – 13:22
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని (2) ||తార||
మందను విడచి మమ్మును మరచి
మేమంతా కలిసి వెళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో
స్తుతి గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే
లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార||
బంగారమును సాంబ్రాణియు
బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో
నిను కనులారా గాంచాములే (2)
మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే ||తార||
4th song – 19:10
అందరు మెచ్చిన అందాల తార
అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)
క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు||
సృష్టికర్తయే మరియ తనయుడై
పశుల పాకలో పరుండినాడు (2)
నీతి జీవితం నీవు కోరగా
నీకై రక్షణ తెచ్చినాడు (2)
నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్||
ఇంటిని విడిచి తిరిగిన నాకై
ఎదురు చూపులే చూచినాడు (2)
తప్పును తెలిసి తిరిగి రాగా
క్షమియించి కృప చూపినాడు (2)
ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్||
5th song – 25:23
బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)
పరమును విడచి పాకలో పుట్టిన
పాపుల రక్షకుడు మన యేసయ్యా (2) ||బాలుడు||
కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు
ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా
ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి
పరుగు పరుగున పాకను చేరామే (2)
మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము (2)
మా మంచి కాపరని సంతోషించామే
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4) ||బాలుడు||
చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము
పరిశుద్ధుని చూసి పరవశించామే
రాజుల రాజని యూదుల రాజని
ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా (2)
బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2)
ఇమ్మానుయేలని పూజించామమ్మో
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4) ||బాలుడు||
6th song not available