
బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు✝️🛐 #Christmassongs telugu

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు✝️🛐 #Christmassongs telugu
బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)
పరమును విడచి పాకలో పుట్టిన
పాపుల రక్షకుడు మన యేసయ్యా (2) ||బాలుడు||
(1). కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు
ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా
ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి
పరుగు పరుగున పాకను చేరామే (2)
మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము (2)
మా మంచి కాపరని సంతోషించామే
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)
(2). చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము
పరిశుద్ధుని చూసి పరవశించామే
రాజుల రాజని యూదుల రాజని
ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా (2)
బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2)
ఇమ్మానుయేలని పూజించామమ్మో
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4) ||బాలుడు||