మన్నేగదయ్యా మన్నేగదయ్యా || Mannegadayya Mannegadayya ||Telugu Christian Songs with Sing along Lyrics

మన్నేగదయ్యా మన్నేగదయ్యా || Mannegadayya Mannegadayya ||Telugu Christian Songs with Sing along Lyrics


|Like,Share, Subscribe and be Blessed|

Lyrics:
మన్నేగదయ్యా మన్నేగదయ్యా (2)
మహిలోని ఆత్మ జ్యోతియు తప్ప
మహిలోనిదంతా మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||

మంచిదంచు ఒకని యించు సంచిలోనే ఉంచినా
మించిన బంగారము మించిన నీ దేహము (2)
ఉంచుము ఎన్నాళ్ళకుండునో
మరణించగానే మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||

మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము
ఒక్కనాడు ఆరిపోగా నీలో ఆత్మ దీపము (2)
కుక్క శవంతో సమమేగా
నిక్కముగనదియు మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||

మానవునికి మరణమింత ఎంచనంత మన్నిల
మరణమును జయించుచున్న కాలమింత మన్నిల (2)
మరణ విజయుడేసు క్రీస్తుడే
మది నమ్ము నిత్య జీవమిచ్చ్చును (2) ||మన్నేగదయ్యా||

Trip.com WW

Scroll to Top