మహానీయుడు-2023/New Telugu christian song/HEAVENLY GRACE ministries worship song/pastor prem kumar
మహానీయుడు-2023
పల్లవి:
మహానీయుడవు నీవే కదా నా హృదయ సారధివి నీవేకదా ఆనందించెదను నీలో ప్రతిక్షణం ఆర్భాటముతో ప్రతిగానాలతో నీవు చేసిన ఉపకారములకై
ఆరాధన స్తుతి ఆరాధన-ఆరాధన నీకే నా యేసయ్యా. llమహాll
1. ప్రార్ధించు వేళలో నా చేరువై కృపతో నన్ను నింపిన ప్రభువా పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించి మహిమ కలిగిన పాత్రగ చేసితివి
ఆరాధన స్తుతి ఆరాధన-ఆరాధన నీకే నా యేసయ్య. llమహాll
2. ఉన్నతమైన స్థలములలోన వశియించు వాడవు ఘనుడగుదేవా నీ కనుదృష్టియు మనస్సునుంచితివి నా ప్రతి మనువులకు కార్యము చేసితివి
ఆరాధన స్తుతి ఆరాధన-ఆరాధన నీకే నా యేసయ్యా. llమహాll
3.నా కాపరివై నా తోడు నడచి నా ప్రతి అడుగులను దీవించితివి స్తుతి యాగముగా నీ పరిచర్యలో సాక్షిగ యిలలో నే సాగెదను.
ఆరాధన స్తుతి ఆరాధన-ఆరాధన నీకే నా యేసయ్యా. llమహాll
మహానీయుడవు నీవే కదా నా హృదయ సారధివి నీవేకదా ఆనందించెదను నీలో ప్రతిక్షణం ఆర్భాటముతో ప్రతిగానాలతో నీవు చేసిన ఉపకారములకై
ఆరాధన స్తుతి ఆరాధన-ఆరాధన నీకే నా యేసయ్యా llమహాll
కృతజ్ఞత హృదయముతో ఉప్పొంగిన ఆత్మీయ స్తుతి ఆరాధన గీతం.
“HEART TOUCHING SONG -NEWLY RELEASED , LISTEN AND BE BLESSED”