
రారే చూతము రాజ సుతుని | Rare Chuthamu Raja Suthuni | Telugu Christmas Song

రారే చూతము రాజ సుతుని | Rare Chuthamu Raja Suthuni | Telugu Christmas Song
రారే చూతము రాజ సుతుని
Rare Chuthamu Raja Suthuni
written by :
Sri. CHETTI BHANUMURTHY
రారె చూతము రాజ సుతుడీ రేయి జనన మాయెను (2)
రాజులకు రా రాజు మెస్సియ (2)
రాజితంబగు తేజమదిగో (2) ||రారె||
1.దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2)
ధరణి కరిగెనీ దినమున (2) ||రారె||
2.కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం (2)
తెల్లగానది తేజరిల్లెడి (2)
తారగాంచరే త్వరగ రారే (2) ||రారె||
3.బాలుడడుగో వేల సూర్యల బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాల వృద్ధుల (2)
నేల గల్గిన నాధుడు (2) ||రారె||
***⚠️Copyright : Copyright to respective Originals/Parties.