లంగరేసినావా నా నావకు (langaresinaava naa naavaku) lyrics | New Telugu Christian Worship song 2023 |
Langaresinaava Naa Navaku l Telugu Song #lyrics INew telugu christian song/sis.Kanthi Kala Singer
ll @KANTHIKALA ll
ll @InfiniteLoveofChristt ll
sis.kanthikala gariమరొకకొత్త పాట “”పోతోందికాలం “తప్పక చూడండి.https://youtu.be/ianlhMSefUE..మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు మా శుభాభివందనములు.
ll Jesus lyrics ll
లంగరేసినావా నా నావకు
కొట్టుకొని పోకుండా నే చివరకు
లంగరేసినావా నా నావకు
పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి
తీరం చేరేదాక నావలోన అడుగు పెట్టి
కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి
ఊపిరి ఆగేదాకా ప్రేమ తోనే చంక బెట్టి
లోక సంద్రాన నా జీవ నౌక
అద్దరికి చేరేదాక సాగు గాక
నీ దరికి చేరేదాక సాగు గాక
1)చుట్టు వున్న లోకం మాయదారి / మాయ సుడిగుండం
నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2)
రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే
నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే
నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె
చూశాను నీ వైపు (2)
ఆహా ఎంత చల్లిని చూపు
ఆహా ఎంత చల్లని నీ చూపు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి…
2)సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే
సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2)
శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే
వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే
యే దారి కానరాక దిక్కులేక నేనుంటే
నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
చూశాను నీ వైపు (2)
ఆహా ఎంత చల్లిని చూపు
ఆహా ఎంత చల్లని నీ చూపు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి…
3)జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి
జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2)
నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి
నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి
నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి
క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి
చూస్తాను నీ వైపు (2)
ఊపిరి ఉన్నంత సేపు
నాలో ఊపిరి ఉన్నంత సేపు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి…
లంగరేసినావా నా నావకు
కొట్టుకొని పోకుండా నే చివరకు
లంగరేసినావా నా నావకు
పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
ll Jesus ll
మన ఆత్మలను నరకం నుండి రక్షించుటకు శక్తి కలిగినది “దేవుని వాక్యము”.
మనపై దేవుని మనస్సులోని ఆలోచనలను తెలియజేసేది “దేవుని వాక్యము”.
దేవుని యెదుట ఎన్నటికి , ఎప్పటికి పాపము చేయకుండా ఎప్పటికప్పుడు మన హృదయాలను ఖండించి, గద్దించి, బుద్ది చెప్పేది ” దేవుని వాక్యము”.
మనిషిని దేవునికి మరింత దగ్గర చేయుటకు, విశ్వాసములో స్థిరులను చేయుటకు మరియు దేవుని రాజ్యానికి సిద్ధపరచుకొనుటకు ఉపయోగపడు శక్తివంతమైన ఆత్మీయ సందేశాలను ప్రతి వారికి అందించి పర సంబంధమైన ఆశీర్వాదములను పొందాలనే ఉద్దేశ్యముతో ఈ యూట్యూబ్ ఛానల్ రూపించడం జరిగింది. కనుక, ఆత్మీయ అభివృద్ధినిచ్చే ఈ ఆత్మీయ సందేశాలను విని, గ్రహించి, హృదయములో భద్రపరచుకుని, వాక్యానుసారముగా జీవిస్తూ మీ వంతుగా దేవుని పనిలో ఉంటూ దైవ ఆశీస్సులు పొందాలని మా ఆశ, మా ప్రార్ధన. ఈ విలువైన ఆత్మీయ సందేశాలను మీరు వీక్షించి అనేకులకు చేరవేసి దేవుని పనిలో పాలి భాగస్తులు కండి…🙏🙏🙏 ll
– SHARE – SUBSCRIBE – SUPPORT – SPREAD THE GOSPEL —–
#2023 #telugu #song #new #yesu #1m #new #christmas #new #jesus #lyrics #lyricalstatus #latest #yesu lyrics song telugu…..