సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి|| Telugu Christmas Songs|| Andhra christava keerthanalu||

Deal Score0
Deal Score0
సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి||  Telugu Christmas Songs|| Andhra christava keerthanalu||

సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి|| Telugu Christmas Songs|| Andhra christava keerthanalu||


Lyrics:- Bethala John
Vocals:- V Jhansi Garu
Presents. S. Suresh Gospel Singer

సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి
యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని
సంతోషించుడి నాతో సంతోషించుడి ||సంతోషించుడి||

అంధకార మయమైన భూమి నా
ద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింప
వందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండై
భూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతోషించుడి||

కాన నంధకారంబు దొలఁగఁ ప్ర
కాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండు
మానవులను సంతోష పర్చనై – మహిని నవతరించె
భక్తుల మనము సంతసించె ||సంతోషించుడి||

మిన్ను నుండి సంతోషోదయము
మిగుల ప్రకాశించె – హృదయములఁ – దగుల ప్రకాశించె
మున్ను జేయబడిన వాగ్ధత్థము – తిన్నగ నెరవేరే
భక్తుల కన్ను లాస దీరె ||సంతోషించుడి||

ప్రీతియైన నీ పండుగ గూర్చి
నూతన కీర్తనను – గలసికొని – నాతో పాడుచును
నీ తరి దూరస్థుల-కీ వార్తను – నే తీరును నైనఁ
దెలుపఁగ నాతురపడవలెను ||సంతోషించుడి||

పాపులపై దేవునికి గలిగిన
ప్రబలమైన దయను – లోకమునఁ – జూపింపఁ గవలెను
జూపక పోయిన లోపము మనపై – మోపబడును నిజము
వేగము జూపుద మా పథము ||సంతోషించుడి||

#TeluguChristmasSongs
#AndhraChristavakeerthanalu
#ssureshgospelsinger
#CSI_Church_Narasingapalem

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

S.Suresh Gospel Singer
      SongsFire
      Logo