Jolapaadi ninnu nenu ooyalupena || Telugu Christmas Song
జోల పాడి నిన్ను నేను ఉయలూపేనా కన్నా
ఉయలూపేనా..
పేద తల్లి లాలి పాట నిదురపుచ్చేనా చిన్నా
నిదురపుచ్చేనా..
బజ్జో కన్నా లాలి – బుజ్జి నాన్నా లాలి
పావనాత్మ లాలి – ఇది అమ్మ పాడె లాలి (1)
¶జోల పాడి¶
1. నా కంటి పాప – నా కాంతి రేఖ (2)
నిరు పేద తల్లిని ఏమివ్వగలను
నా గర్భమే నీకు కోవెల
నీ తోడిదే నాకు వెన్నెల
నీవు లేకుంటే ఈ లోకమే చీకటి వల..
ఈ లోకమే చీకటి వల..
¶బజ్జో కన్నా¶
2. నా కన్న తండ్రీ నా నోము పండీ
కన్నీటి బ్రతుకునా పన్నీరు వైతివీ
నీ నవ్వులె పారిజాతమూ
నీ చూపులే సుప్రభాతమూ
నీవు తోడుంటే ఈ బ్రతుకే తీయని వరం
ఈ బ్రతుకే తీయని వరం
¶బజ్జో కన్నా¶