Idhi Kanneeti Paata || Telugu Christmas Song

Faith Score0
Faith Score0

Idhi Kanneeti Paata || Telugu Christmas Song


#christmas #christmassongs #teluguchristmassong #oldchristmassongs

ఇది కన్నీటి పాట – క్రిస్మస్ సిలువ పాట (2)
కరకు గుండెలు కరిగించే పాట
కల్వరి కొండకు నడిపించే పాట
                                                 ¶ఇది కన్నీటి¶
1.  సర్వ సృష్టికర్తకు స్థలము ఎక్కడ
     సత్రములో స్థలమైనా లేదు ఇక్కడ(1)
     సర్వోన్నత శక్తికి ప్రసవమెక్కడ
     పశువుల పాకే ప్రసూతి స్థలము ఇక్కడ(1)
     ఆత్మలో తగ్గింపు తత్వమే (2)
     క్రిస్మస్ సిలువ మార్గము (1)
                                                 ¶ఇది కన్నీటి¶
2.  రాజుల రారాజుకు నివాసమెక్కడ
     తల వాల్చుటకు తలగడ లేదు ఇక్కడ (1)
     ప్రభువుల ప్రభువుకు పీటమెక్కడ
     ఒలీవ తోటలో రాళ్ళు రప్పలిక్కడ (1)
     మనస్సులో ప్రార్థనా తత్వమే (2)
     క్రిస్మస్ సిలువ సత్యము (1)
                                                 ¶ఇది కన్నీటి¶
3.  దూతాలి స్తుతి పాత్రుడు యేసు అక్కడ
     మానవాళి బలి పశువు క్రీస్తు ఇక్కడ (1)
     కృపాసనాశీనుడు యేసు అక్కడ
     గొల్గోత గొరియపిల్ల క్రీస్తు ఇక్కడ (1)
     శరీరాన సమర్పణ తత్వమే (2)
     క్రిస్మస్ సిలువ జీవము (1)
                                                 ¶ఇది కన్నీటి¶

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Telugu Christian Music Collections (TCMC)
      Songs Fire
      Logo