కరుణించవా దేవా – కరుణాత్ముడా రావా – KARUNINCHAVA DEVA ॥ Telugu Christian Song Pas.ABRAHAM
https://whatsapp.com/channel/0029Va9HNO284OmBWZIX8e46
#Hosannaministries #Hosannaministriesgorantla
#HosannaMinistriesOfficial #live
కరుణించవా దేవా – కరుణాత్ముడా రావా
నీ ప్రేమ లోనే – కావుమా
శ్రమ లోన తోడే లేక – శిలనైన కానే కాక
వేసారి పోయా యేసయ్యా
పిలిచాను నిన్నే దేవా – కడదాక నాతో రావా
నా జీవ దాత యేసయ్య ” కరుణించవా ”
ఆశే నీవై నాలో – నా జీవ గమనము లోన
దారే చూపే నాకు – నీ వాక్య వెలుగుల లోన
నీలో నివాసమే – నాలోని కోరిక
నీ స్నేహ బంధమే – సంతోష కానుక
నీలో నిరీక్షణే – నా మౌన గీతిక
కాలాలు మారిన నీవుంటే చాలిక ” కరుణించవా ”
నీ ప్రేమే నాపై చూపి – నా చేయి విడువని దేవా
ధైర్యం నాలో నింపి – నా తోటి నడిచిన దేవా
నీ సత్య మార్గమే – నా జీవ బాటగా
నీ నామ ధ్యానమే – నా లోని శ్వాసగా
నీలోనే ఏకమై – నీ ప్రేమ సాక్షి నై
సాగాలి యేసయ్య – నా జీవితాంతము