Akasam Veligindhi Rathri Velalo || Telugu Christmas Song

Akasam Veligindhi Rathri Velalo || Telugu Christmas Song


ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
భూలోకం నిండింది శాంతి సంతోషం
పరలోకం విరిసింది గాన ప్రతిగానం (2)
సర్వోన్నతమైన స్థలములలో
ఘన దేవునికే మహిమా
ఆయన కిష్టులైన మనుజులకు
భూమ్మీద సమాధానము
కలుగునుగాక కలుగునుగాక హల్లెలూయాని (2)

1) పరలోక నాధుండు – లోకాన్ని ప్రేమించి
పరసుతుడై పుట్టాడు – మరియమ్మ గర్భామందున
ధరపాపి రక్షింపన్ నరరూప దాల్చాడు(2)
¶ఆకాశం¶

2) పొలమందు కాపరులు రాత్రివేళయందు
చలియందు తమ మందను కాపుకాయుచు నుండు
ఎరిగించె శుభవార్త దూత గొల్లలకు (2) ¶ఆకాశం¶

3) చూచారు గగనానా – ఒక తార జ్ఞానులు
చేరారు ఆ తార వెంట-బెత్లెహేము గ్రామమున్ (2)
గాచారు ప్రభురాజున్ మ్రొక్కికాంతులతో (2)
¶ఆకాశం¶

Trip.com WW

Scroll to Top