AMARAMAINA PREAMA || HOSANNA MINISTRIES NEW SONG || PASTOR.JOHN WESLEY

AMARAMAINA PREAMA || HOSANNA MINISTRIES NEW SONG || PASTOR.JOHN WESLEY


ప్రేమే శాశ్వతమైన – పరిశుద్ధమైన పొదరిల్లు ( హో….. )” 2″
మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే
నిన్నా శ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే
నిరంతరం నీ మాటలతో ప్రకాశింపచేయుదువు ” ప్రేమే”
1
అమరమైన నీ చరితం – విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరిచిన – పరివర్తన క్షేత్రము “2”
ఇన్నాళ్లుగ నను స్నేహించిన ఇంతగ ఫలింపజేసితివీ
ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను….
ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా…. నీ నీడ లేకుండా “ప్రేమే”
2
కమ్మనైన నీ ఉపదేశము – విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన – వాక్యము ధైర్యమిచ్చె నా శ్రమలో “2”
కరువు సీమలో సిరులొలికించెను -నీ వాక్యప్రవాహము
గగనము చీల్చిమోపైన – దీవెన వర్షము కురిపించితివీ..
ఘనమైన నీ కార్యక్రములు వివరింప నా తరమా – వర్ణంప నా తరమా “ప్రేమే”
3
విధిరాసిన విషాదగీతం – సమసిపోయె నీ దయతో
సంభరమైన వాగ్దానములతో – నాట్యముగా మార్చితివీ “2”
మమతల వంతెన దాటించి – మహిమలో స్థానమునిచ్చితివీ
నీ రాజ్యములో జేష్టులతో – యుగాయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా…. “ప్రేమే

#Hosannaministries #hosannaminstriesofficial #Hosannanewsong #pas.JOHNWESLEY
#Hosannaofficial #Newsongs
Try Amazon Fresh

Scroll to Top