Chukka Puttindhi 2 – Emmanuel Dance Cover ( ఇమ్మానుయేలు ) | Latest New Telugu Christmas Song

Chukka Puttindhi 2 – Emmanuel Dance Cover ( ఇమ్మానుయేలు ) | Latest New Telugu Christmas Song


#christmasdancesongs #chukkaputtindhi #songs #dance #christmas #christmasdancetelugu
Credits:
Original song

Dance Credits :
Anusha [Choreography]
Benhin
Hanokabraham
Vijaya
JoyAngelin

TELUGU LYRICS:

యుగపురుషుడు
శకపురుషుడు
ఇమ్మానుయేలు
లోకరక్షకుడు

చుక్క పుట్టింది ధరణి మురిసింది
చుక్క పుట్టింది ధరణి మురిసింది
రాజులకు రారాజు వచ్చాడనింది
ఆకాశంలోనా వెలుగే నింపింది
శ్రీ యేసు పుట్టాడని
ఈ బాలుడే – తండ్రి పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని
ఈ బాలుడే – మన పితరులకు వాగ్ధానముచేయబడిన మెస్సయ్య ఇతడేనని
ఈ బాలుడే – తన నోటిమాటతో జగమును సృష్టించిన ఎలోహిం దేవుడని
ఈ బాలుడే – నిన్న నేడు నిరంతరము ఉండువాడనీ…

శకమే ముగిసే – నవశకమే మొదలే
నింగి నేల ఆనందముతో నిండెనే
దివినే విడిచే పరమాత్ముడే
పాపం శాపం తొలగింపనేతెంచెనే

శరీరధారిగా భువిలోకి వచ్చెగా – మనకోసమే ఇమ్మానుయేల్
మన పాపాశాపముల్ హరింప వచ్చెగా – మన కోసమే రక్షకుడై

జగత్ పునాది వేయక ముందే ఉన్నవాడే – ఉన్నవాడే
అబ్రహాముకంటె ముందే ఉన్నవాడే – ఉన్నవాడే
వెలుగుకమ్మని నోటితో పలికిన వాడే
సూర్య చంద్ర తారలను చేసిన వాడే
నిన్న నేడు నిరతరము నిలిచేవాడు ఈయనే

నిత్యానందము నిత్యజీవము నీకిచ్చును ఇమ్మానుయేల్
నీ చీకటంతయు తొలగింప వచ్చెగా నీకోసమే నీతి సూర్యుడై

2. దుఃఖితులను ఓదార్చుటకు వచ్చినవాడే మన యేసయ్య
పాపమును తొలగించుటకు వచ్చినవాడే మన యేసయ్య
మంటి నుండి మానవుని చేసినవాడే
మహిమను విడిచి మనకోసమే వచ్చాడే
కంటిపాపలా మనలను కాచేవాడు ఈయనే
మహిమాస్వరూపుడే మనుజావతారిగా మహిలోకి వచ్చే ఇమ్మానుయేల్
మన పాపాశాపముల్ హరింప వచ్చెగా – మన కోసమే రక్షకుడై

|| చుక్క పుట్టింది – Pallavi REPEAT ||

ఇమ్మానుయేలు – ఎలోహీం (బలమైనవాడు)
ఇమ్మానుయేలు – ఎల్ షదాయ్ (సర్వశక్తిగలవాడు)
ఇమ్మానుయేలు – అడోనయ్ (యజమానుడు)
యావే (ఉన్నవాడు)
ఇమ్మానుయేలు – రాఫా (స్వస్థపరచు దేవుడు)
ఇమ్మానుయేలు – ఎల్ రోయి (చూచుచున్న దేవుడు)
ఇమ్మానుయేలు – ఎల్ ఓలాం (శాశ్వతమైన దేవుడు)
షాలోం (సమాధానకర్త)

ఎల్ ఇశ్రాయేల్ (ఇశ్రాయేలు దేవుడు)
ఎల్ హన్నోరా (అద్భుతమైన దేవుడు)
ఎల్ మిఖాదేష్ (పరిశుద్ధపరచు దేవుడు)
ఎల్ హఖావోద్ (మహిమగల దేవుడు)
ఇమ్మానుయేల్ (దేవుడు మనకు తోడు)

ఆమెన్ అనువాడా అల్ఫా ఒమేగా
నిన్న నేడు నిరతము నిలుచు వాడా

Trip.com WW

Scroll to Top