Krupalanu Talanchuchu కృపలను తలంచుచు | Telugu Christian Song | Bro Yesanna Garu | Dr. Betty Sandesh

Krupalanu Talanchuchu కృపలను తలంచుచు | Telugu Christian Song | Bro Yesanna Garu | Dr. Betty Sandesh

Song Lyrics –
Bro Yesanna Garu,
Hosanna Ministries

కృపలను తలంచుచు… కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని… కృతజ్ఞతతో స్తుతింతున్
ఆయుష్కాలమంతా ప్రభుని… కృతజ్ఞతతో స్తుతింతున్

కన్నీటి లోయలలో… నే కృంగిన వేలలలో
కన్నీటి లోయలలో… నే కృంగిన వేలలలో
నింగిని చీల్చి… వర్షము పంపి
నింపెను నా హృదయం, యేసు… నింపెను నా హృదయం
నింగిని చీల్చి… వర్షము పంపి
నింపెను నా హృదయం, యేసు… నింపెను నా హృదయం

కృపలను తలంచుచు… కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని… కృతజ్ఞతతో స్తుతింతున్

రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను
రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను
నాకు విరోధమై వర్ధిల్లదు యని
చెప్పిన మాట సత్యం, యేసు… చెప్పిన మాట సత్యం
నాకు విరోధమై వర్ధిల్లదు యని
చెప్పిన మాట సత్యం, యేసు… చెప్పిన మాట సత్యం

కృపలను తలంచుచు… కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని… కృతజ్ఞతతో స్తుతింతున్

సర్వోన్నతుడైన… నా దేవుని తో చేరి
సర్వోన్నతుడైన… నా దేవుని తో చేరి
సతతము తన కృప వెల్లడిచేయ
శుద్దులతో నిలిపెను, ఇహలో… శుద్దులతో నిలిపెను
సతతము తన కృప వెల్లడిచేయ
శుద్దులతో నిలిపెను, ఇహలో… శుద్దులతో నిలిపెను

కృపలను తలంచుచు… కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని… కృతజ్ఞతతో స్తుతింతున్

హల్లెలూయా ఆమెన్… ఆ ఆ, నాకెంతో ఆనందమే
హల్లెలూయా ఆమెన్… ఆ ఆ, నాకెంతో ఆనందమే
సీయోను నివాసం… నాకెంతో ఆనందం
ఆనందమానందమే ఆమెన్… ఆనందమానందమే
సీయోను నివాసం… నాకెంతో ఆనందం
ఆనందమానందమే ఆమెన్… ఆనందమానందమే

కృపలను తలంచుచు… కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని… కృతజ్ఞతతో స్తుతింతున్

Trip.com WW

Scroll to Top