Manasaina Devudu Manasunna Devudu || Telugu Christmas Song
మనసైన దేవుడు – మనసున్న దేవుడు
మనిషికోసం తానే మనిషైన దేవుడు (2)
హల్లెలూయ హల్లెలూయ (3)
క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్ (1)
1. గుడి ఒక దేవుని బడి అని
దొంగల గుహ కాకూడదని (2)
దేవాలయ శుద్ధీకరణలో (2)
దిగివచ్చిన దేవుడు (2)
¶హల్లెలూయ¶
¶మనసైన¶
2. మనిషోక దేవాలయమని
చెదరిన దేవుని రూపమని (2)
దైవమానవ నూతన సృష్టిలో (2)
దిగివచ్చిన దేవుడు (2)
¶హల్లెలూయ¶
¶మనసైన¶