
NAA POURASTHITHI – నా పౌరస్థితి sung by A R Stevenson Telugu Christian Song

NAA POURASTHITHI – నా పౌరస్థితి sung by A R Stevenson Telugu Christian Song
నా పౌరస్థితి పరమందున్నది
ఇల నా ఉనికి అస్థిరమైనది
యాత్రికుడనని నేనెరుగుదును
ఒకనాడు నా ఇంటికి చేరెదను
1. నాశనకరమైన గుంటను పోలిన
లోకమునుండి లాగబడియున్నాను
తిరిగి జన్మించిన పరదేశీయుడను
పరలోక పిలుపును ఎరిగియున్నాను
2. నరులారా తిరిగి రండని పిలిచిన
నేనూ అచటికి వెళ్ళిపోవలయును
నిత్యత్వమందున దేవునితో ఉందును
పరలోక మహిమను అనుభవించెదను
3. నాకొరకు త్వరగా రానైయుండిన
ప్రభుక్రీస్తు కొరకు కనిపెట్టుచున్నాను
ముందున్నవాటికై వేగిరపడెదను
పరలోక తలుపులు కలిగియున్నాను