Neelala Kallallo Neerelanayya || Telugu Christmas Song

Neelala Kallallo Neerelanayya || Telugu Christmas Song


నీలాల కళ్ళల్లో నీరేలనయ్యా
ఆదమరచి నిదురోవయ్య యేసయ్య
నే జోల పాడేనయ్యా (1)
కష్టాలు కడగండ్ల లోకాన్ని నువ్వు మరచి
కాసేపు నిదురోవయ్య ఓ క్రీస్తు
నే జ్యోల పాడేనయ్యా(1)
కరుణామయుడంటు నిన్ను కీర్తించే వారి కొరకు
రాత్రనక పగలనక సేవ చేసి అలసినావా(1)
                                                       ¶నీలాల¶
1. నా మనసే ఊయలగా నిన్ను ఊపనా
చక్కంగా నిదురోవగా (1)
     నా తనువే పానుపుగా నీకు చేయనా
     మెత్తంగా నిదురోవగా (1)
జాబిల్లిని తెచ్చి నీకు చలువలియ్యమంటాను(1)
     చిరుగాలిని పిలిచి నీకు గాలి విసరమంటాను(1)
     తెల్లార్లు నిన్ను చూసి నేను మురిసిపోతాను(1)
                                                       ¶నీలాల¶
2. నీ కోసం పరిచారికనైనానయ్యా
నిత్యం నీ సేవ చేయగా(1)
ఏ నిమిషం నిన్ను విడిచి ఉండలేనయ్యా
రాత్రంతా కాపు కాయనా(1)
నీ తల్లిని కాదు కాని నీకు అమ్మనవుతాను (1)
ఆ చల్లని మాతృ ప్రేమ పాలు పంచుకుంటాను(1)
నూరేళ్ళు నీకు నేను పాద దాసినవుతాను(1)
                                                       ¶నీలాల¶
Try Amazon Fresh

Scroll to Top