NEELI NEELI NINGILONA | Latest Telugu Christmas Song | Pastor Anil Kiran Official – SIDC
Also available on YouTube @sidchurchgaklive
CREDITS:
Lyrics, Tune, Music Composition: Pastor Giddie Anil Kiran
Vocals: Giddie Anne Shylaja
Music & Programming: Giddie Henry Tarun
Cinematography: Suresh Dubbaku
Mixing & Mastering: Ramesh Erram
Video Editing: Joel Arun
Recorded at: Raagalaya Digitals, Hyderabad
Exclusive copyright of the entire song, music, lyrics and video belong to Shalom International Discipleship Church, Hyderabad and Pastor Giddie Anil Kiran. Any infringement will attract legal penalties as applicable under copyright laws.
Kindly pray for our Anil Kiran International Ministries and SIDC (Shalom International Discipleship Church).
For any further information, please contact: Ph: +91 9701208010
Email: [email protected]
LYRICS:
||నీలి నీలి నింగిలోన – దూతల మధుర జోల
హాయి హాయి రేయిలోన – కమ్మని గాన హేల
దివినేలు దైవ కొమరుడే – భువిలోన మరియ తనయుడై
నరరూపు దాల్చెనే దీనుడై||
॥ నీలి నీలి నింగిలోన – దూతల మధుర జోల
హాయి హాయి రేయిలోన – కమ్మని గాన హేల॥
సుదూరాల తీరము దాటి – దూరమైన మనుజుల కోసం
సర్వలోక శిల్పియే ఇలలో – ధరించేను మానవ రూపం
చరిత యెన్నడెరుగని ప్రేమ – కొలతలేని ప్రేమ
పరితపించి దైవం తానే – ప్రాణమిచ్చు ప్రేమ
మాసిపోని – మారిపోని – చెరిగిపోని ప్రేమ
॥ నీలి నీలి నింగిలోన – దూతల మధుర జోల
హాయి హాయి రేయిలోన – కమ్మని గాన హేల॥
పాలుగారు పసిబాలుడిగా – శయనమైన యేసుని చూడ
జాలువారు స్తుతిగానములే – పయనమైన గొల్లలు పాడ
విశ్వమంత ఏలే రాజు – వింతయైన పాకలో
నిశ్చలంగ నిదురేపోగ – శాంతమైన రేయిలో
పుడమి తానే – పులకరించే – ప్రేమ రాజు రాకతో
||నీలి నీలి నింగిలోన – దూతల మధుర జోల
హాయి హాయి రేయిలోన – కమ్మని గాన హేల
దివినేలు దైవ కొమరుడే – భువిలోన మరియ తనయుడై
నరరూపు దాల్చెనే ద్దెనుడై||
॥ నీలి నీలి నింగిలోన – దూతల మధుర జోల
హాయి హాయి రేయిలోన – కమ్మని గాన హేల॥
#sidchurchgaklive #GiddieAnilKiran #ShylajaKiran #GiddieHenryTarun #TeluguChristianSongs #TeluguChristmasSongs #ShalomInternationalDiscipleshipChurch