
New Telugu Christmas song || 2022-23 || జన్మించినాడుర || @pastorwilsonmanukonda
దేవుని కృపలో ఈ పాట రెండు సంవత్సరాల క్రితం రచించడం జరిగింది. ఈ సంవత్సరం మా దగ్గర వున్న చిన్నపాటి పరికరంతో మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు సహాయం చేశారు.
అందరూ పాడుతూ దేవుని మహిమపరుస్తారు అని ఆశిస్తున్నాను.
నాకు సహకరించిన నా కుటుంబమునకు, నా ఆత్మీయ సహవాస మిత్రులకు, సంఘమునకు కృతజ్ఞతలు.
పల్లవి: జన్మించినాడు రా దిగి వచ్చినాడు రా నీ కొరకే నా కొరకే మెస్సయ్యా
జన్మించినాడు రా దిగివచ్చినాడు రా నిన్ను నన్ను రక్షింపను యేసయ్య (2)
చీకటనే కట్లు తెంచి ఓ ఓ ఓఓ…
సత్యమనే వెలుగునీయ ఓ ఓ ఓఓ… (2) ||జన్మి||
చ: ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి (2)
సమాధానకర్తయగు అధిపతి అవతరించినాడు నేడు జగతికి (2)
ప్రవచనములు నెరవేర్చను ఓ ఓ ఓఓ..
పరమాత్ముడు జన్మించే ఓ ఓ ఓఓ.. (2) ||జన్మి||
చ: దావీదు పురంలో రక్షకుడు జన్మించే పశువుల పాకుల దీనుడై పవళించే (2)
తూర్పు దేశా జ్ఞానులు వచ్చిరి సాగిలపడి ఆయనకు మ్రొక్కరి
గొర్రెల కాపరులు వచ్చిరి దేవునికి స్తోత్రము చేసిరి ఇమ్మానుయేలుగా ఓ ఓ ఓఓ..
ఆయన మన తోడుగా ఓ ఓ ఓఓ.. (2)
చ: మార్గము సత్యము జీవము ఆయనే జీవాహారముయు జీవజలము ఆయనే (2) ఆదియందు వాక్యమైన దేవుడే కృపా సత్య సంపూర్ణుడాయనే (2)
నిత్యజీవం మనకియ్యను ఓ ఓ ఓఓ..
త్వరలో రానున్నాడు ఓ ఓ ఓఓ..