Prabhu Yesu Puttinaroju || Telugu Christmas Song
యేసు క్రీస్తు పుట్టినరోజు
ఎన్నో వెలుగులు విరిసిన రోజు (2)
సహనం కరుణ పండిన రోజు
సత్యం ధర్మం నిలిచిన రోజు ¶యేసు క్రీస్తు¶
1. సల్లని తల్లి మేరీ మాత
ముద్దుల తనయునిగా (2)
పశువుల పాకలో చీకటి లోగిలిలో(2)
వేకువ మొలిచిన రోజు(2)
ప్రభువే పుట్టినరోజు
మన ప్రభువే పుట్టినరోజు
¶యేసు క్రీస్తు¶
2. దిక్కే తెలియని దీనులలో
దారే మరచిన ఆర్తులలో(2)
తన సన్నిధితో ఒక పెన్నిధిగా(2)
ఆశలు నింపిన రోజు
భగవానుడు పుట్టినరోజు(2),
¶యేసు క్రీస్తు¶