Skip to content

Raajadhi Raju – Sambaralu 8 Telugu Christmas Songs lyrics

Raajadhi Raju – Sambaralu 8 Telugu Christmas Songs lyrics

వెలుగై దిగివచ్చె ప్రభు యేసు జన్మించే ఇల సూరీడు
నీకోసం వచ్చాడు వెలిగించ వచ్చాడు సూరీడు

రాజాధి రాజుగా లోకాన జ్యోతిగా పుట్టాడు నా యేసయ్య
కనులారా చూడగా రారండి వేడగా వచ్చాడు నా మెస్సయ్య
దేవాది దేవుడే ఈనాడే దీనుడై పుట్టాడు నీకోసమే
ఈ గొప్ప కానుక సంతోష వేడుక చెయ్యాలి ఆర్భాటమే
నిన్ను కాపాడగా ప్రేమ చూపించగా మన ప్రభుయేసు ఉదయించెనే
నిన్ను రక్షించగా ఇల దీవించగా ఈ పుడమందు జనియించెనే
నిను కరుణించ అరుదెంచెనే

  1. ఆకాశాన – ఆనందాలే – పలికెను – ఈ రేయిలో – యేసే పుట్టాడనీ
    ఊరు వాడ – పొంగి పోయే- నేడే ఓ సంబరం
    మెరిసే తార – దారే చూపీ – చేసే ఆడంబరం

ఉరకలు వేసి యేసుని చూడ వచ్చే గొల్లలు
దరువులు వేసి చాటారండి శుభవార్తను
శిశువును చూసి ఆరాధించి పాడే దూతలు
కానుకలిచ్చి వేడారండీ ఆ జ్ఞానులు

పుట్టాడండీ – పూజించండీ – పసి బాలునీ
మారాజు నీవేనని- మా రారాజు నీవేననీ

  1. క్రీస్తే జీవం – ఆశా దీపం – వెలిసెను – నీ తోడుగా – ఇమ్మానుయేలుగా
    మంచే లేని – ఈ లోకాన – నీకై దిగి వచ్చెనే
    మహిమే వీడి – మనసే కోరీ – నీలో వసియించెనే

వెలుగును నింపే సూరీడల్లే వచ్చాడేసయ్యా
మమతలు పంచె చంద్రునిమల్లే చేరాడయ్యా
కలతను బాపి నెమ్మదినిచ్చి కాచే దేవుడు
కపటము లేని దయ గల వాడే నా దేవుడు

పుట్టాడండీ – పూజించండీ – ప్రభు యేసునీ
మారాజు నీవేనని- మా రారాజు నీవేననీ

Raajadhi Raju Sambaralu 8 song lyrics in English