Seeyonu Kumari Santhoshinchu || Telugu Christmas Song
సియోను కుమారి సంతోషించు (2)
నీ రాజు పుట్టినరోజు పండగమ్మా (2)
యెరూషలేమా గంతులు వేయుము (2)
నీ రాజు రాజాధిరాజుగా పుట్టేనమ్మా
దేవునికేమో మహిమ కలిగెనమ్మా (1)
మనిషికే ఇక సమాధానమమ్మా (2)
¶సియోను¶
1. పరలోకమే ప్రసవించిందమ్మా
పశువుల పాకే పురుడు పోసిందమ్మా (2)
భూలోకమే ఊయల ఊపిందమ్మా
రక్షణ చుక్కే రెక్కలు విప్పిందమ్మా (1)
కాలమే పేరు వ్రాసి ఇచ్చిందమ్మా
క్రీస్తు శకమై సాక్షమిచ్చిందమ్మా (2)
¶సియోను¶
2. గుడ్డివారికే చూపు వచ్చిందమ్మా
చెవిటి వారికే వినికిడి నేర్పిందమ్మా (2)
మూగ వారికే మాట వచ్చిందమ్మా
కుంటి వారికే నడక నేర్పిందమ్మా (1)
చెరసాల సంకెల తెగిపోయిందమ్మా
కలుషాల కన్నీరు ఆగిందమ్మా (2)
¶సియోను¶