Tandri Neetho Nenu song lyrics – తండ్రి నీతో నేను
నీతో నేను నాతో నీవు కలసి వుండాలని
నీదు స్వరము వినుట వలన నాకు ఆనందము (2)
యేసయ్యా నా ప్రాణమా – నా ప్రాణమా నా యేసయ్యా
1.నీ యందు నిలిచి బహుగా ఫలించి తండ్రిని మహిమ పరచాలని
నీదు ఆజ్ఞను నిత్యము గైకొని – నీదు ప్రేమలో నిలవాలని(2)
నీవే నిజమైన ద్రాక్షావల్లి – నీలో ఫలించు తీగను
నేను పరిశుద్ధ పరచుము
నన్ను శుద్దీకరించుము(2)
2.ఆత్మానుసారముగా నేను నడచి ఆత్మఫలములు ఇవ్వాలని
స్తుతి యాగం చేసి జిహ్వ ఫలములు నీకే అర్పించాలని (2)
నీ రాక కొరకై ప్రతినిత్యము సంపూర్ణ సిద్ధి పొందాలని నేను
పరిశుద్ధ పరచుము
నన్నుశుద్ధికరించుము(2)