
Yehova Nee Namamu | యెహోవా నీ నామము ఎంతో బలమైనది| Dr. Betty Sandesh | LCF | Telugu Christian Songs

Yehova Nee Namamu | యెహోవా నీ నామము ఎంతో బలమైనది| Dr. Betty Sandesh | LCF | Telugu Christian Songs
Yehova Nee Namamu | యెహోవా నీ నామము ఎంతో బలమైనది| Dr. Betty Sandesh | LCF | Telugu Christian Songs.
Original Composition: Pastor David Ayya Garu, Written in 1973
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఎంతో ఘనమైనది “యెహోవా”
మోషే ప్రార్ధించగా – మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్ధించగా – సూర్య చంద్రుల నాపితివి “యెహోవా”
నీ ప్రజల పక్షముగా – యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా – భయమేమి లేకుండిరి “యెహోవా”
సింహాల బోనుకైనా – సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే – రక్షించే నీహస్తము “యెహోవా”
చెరసాలలో వేసినా – సంకెళ్ళు భిగియించినా
సంఘము ప్రార్ధించగా – సంకెళ్లు విడిపోయెను “యెహోవా”
పౌలు సీలను బందించి – చెరసాలలో వేసినా
పాటలతో ప్రార్ధించగా – చెరసాల బ్రద్దలాయె “యెహోవా”
మానవుల రక్షణ కొరకై – నీ ప్రియ కుమారుని
లోకమునకు పంపగా – ప్రకటించె నీప్రేమను “యెహోవా”