నాతో మాట్లాడా రావా యేసయ్యా | Naatho Matlada Raava | Vatam Samuel Songs | #teluguchristiansongs

నాతో మాట్లాడా రావా యేసయ్యా | Naatho Matlada Raava | Vatam Samuel Songs | #teluguchristiansongs


నాతో మాట్లాడా రావా యేసయ్యా | Vatam Samuel Official | Ravi Vatam | #teluguchristiansongs
@Christhu mahima Ministries

Lyrics, Tune: Samuel Vatam
Vocals: Ravi Vatam
Music: Ashok. M
DOP, Editing: Rayudu ( CCR Media Official )
Title & Thumbnail Design: Manchi Samareyudu

LYRICS:
ప: నాతో మాట్లాడా రావా యేసయ్యా
నన్ను దర్శింపన్ రావా మెస్సయ్యా ॥2॥
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నీకే ప్రభు ||2|
॥నాతో॥

1. అంధకారమే నన్ను ఆవరించగా
మృత్యువు భయముతో
నే మూల్గుచుండగా ||2||
నాతో మాట్లాడావు యేసయ్యా
నన్ను బ్రతికించావు మెస్సయ్యా ॥2॥
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నీకే ప్రభు ||2|
॥ నాతో॥

2. నిత్యము శోధనలే నన్ను వేదించగా
నీ సన్నిధి చేరి నే ప్రార్థించగా ॥2॥
జయము నిచ్చావు యేసయ్యా
నీ సాక్షిగ నిలిపావు మెస్సయ్య ||2||
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నీకే ప్రభు ||2|
॥నాతో॥

నాతో మాట్లాడా రావా యేసయ్యా పాటను రాయుటకు కృప చూపిన నా యేసయ్యకే మహిమ కలుగును గాక.

ఈ పాటలు శోధన, వేదన, శ్రమలలో జీవించుచున్న వారిని ఆదరించి, ధైర్యపరచాలని,
వారు ఈ పాటలను విని పాడుతూ ప్రభువుని మహిమపరచి,
ఆయన అనుగ్రహించే మెండైన దీవెనలతో అనేక సమస్యలపై ఇలలో జయము నొంది
ఆయన కృపలో నిండుగా మెండుగా వర్ధిల్లాలని ఆశిస్తూ, మీకొరకు ప్రార్థిస్తూ
ఎంతో భారమైన కర్చుతో కూడిన ఈ అద్బుమైన సుమధుర గీతములను మీకు అందించుచున్నాము.

నన్ను రక్షించి, కాపాడి, బలపరచి, దీవించిన యేసుక్రీస్తు ప్రభువు
మిమ్మును మీ కుటుంబమును బహుగా
ఆదరించి, బలపరచి, రక్షించి, దీవించి, ఆశీర్వదించి, కాపాడును గాక.

ఎన్నికలేని నా పట్ల గొప్ప కృపను చూపి ఆయన సాక్షిగా ఇలలో జీవించే ధన్యతను, భాగ్యమును
నాకు అనుగ్రహించిన ప్రభువుని గూర్చి నేను పాడుటకు సంతోషించుచున్నాను.

కన్నీటి ప్రార్థన ద్వారా రాసిన మంచి ఆత్మీయ గీతము ఇది.

ఈ పాట ద్వారా ప్రతి ఒక్కరు శోధన, వేదన, శ్రమల, కన్నిటి, లోయలలోనుండి విడుదల పొంది
దేవుని మహిమపరుస్తూ ఆయన కృపలో వర్ధిల్లాలి అని మా ఆశ మా ప్రార్థన.

మీరు కూడా ప్రార్థించండి ఈ పాటను పూర్తి వరకు విని ప్రభువుని మహిమ పరచండి
ఆయన సన్నిధిని ఆయన అనుగ్రహించే మెండైన దీవెనలను, ఆశీర్వాదములను అనుభవించండి
దేవుడు మిమ్మును మీ కుటుంబమును బహుగా దీవించి ఫలింపజేయును గాక.

మంచి సంగీతాన్ని సమకూర్చిన ప్రేమగల ఆత్మీయ సహోదరులు యం.అశోక్ గారికి,

అద్బుతముగా దేవుని కృప ద్వారా మేము రాసిన ఈ పాటను చక్కగా పాడి ప్రభువుని మహిమపరచి, మరియు పాట కోరకు గుప్పిలి విప్పిన మా పెద్ద తమ్ముడు రవి గారికి, మరియు చిన్న తమ్ముడు జోసెఫ్ గారికి,

అలాగే ఎంతో శ్రద్ధతో సమయం కేటాయించి సమకూర్చిన పాట భావమును దృశ్యరూపంగా చూపడానికి ప్రయాసపడిన ప్రియ సహోదరుడు రాయుడు గారికి నా హృదయపూర్వకమైన నిండు వందనములు కృతజ్ఞతలు.

సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకు కలుగును గాక – హల్లెలూయ.

#samuelvatamofficial.
#ccrmediaofficial
#praiseandworshipsongs teluguchristiansongs
Try Amazon Fresh

Scroll to Top