సిలువ సింహాసనాసీనుడా || 2025 Easter Special Song Telugu || Ravikumar Guduri || #easter #telugu
నీ ప్రేమను వర్ణింపగలమా యేసయ్యా
నీ త్యాగం వివరింపగలమా యేసయ్యా
మహొన్నతుడవైన ప్రభువా మనిషిగా
మహిమ లోకమును విడిచినావు
1. ఉన్నత సింహాసనాసీనుడవు
పశుల పాకలోకి దిగివచ్చినావు
పశుప్రాయులైన మనుషులను
పసిమనసులుగా మార్చిన మా దేవా
2. స్తుతులపై సింహాసనాసీనుడవు
నిందలను బరియించినావు
అయోగ్యులైన మనుషులను
యోగ్యులనుగా మార్చిన మా దేవా
3. పరిశుద్ద సింహాసనాసీనుడవు
ధరణిపై దోషములను మోసావు
కృరులైన మనుషులను
సాత్వీకులుగా మార్చిన మా దేవా
4. ధవళ పు సింహాసనాసీనుడవు
దోషిగా ఇల నిలిచావు
ద్రోహులైన మనుషులను
నీతిమంతులుగా చేసిన మా దేవా
5. సిలువపై సింహాసనాసీనుడవు
మరణపు ముల్లును విరిచావు
పాపులైన మనుషులను
పవితృులనుగా చేసిన మా దేవా
రచన: గూడూరి రవికుమార్
మార్టిన్ మెమోరియల్ బాప్టీస్టు చర్చి
ఒంగోలు
#easter #christian #christiansongs #telugu #jesus #church #song #songs #goodfriday #cross #siluva #teluguworship #teluguchristiansongs #latest #jesussongs #jesussong #christiannewsong #2025