2024 హోసన్నా మినిస్ట్రీస్ న్యూఇయర్ లిరిక్స్ & వీడియో సాంగ్ #Telugu Christian songs # yt videos 🎶🎶🎶

2024 హోసన్నా మినిస్ట్రీస్ న్యూఇయర్ లిరిక్స్ & వీడియో సాంగ్ #Telugu Christian songs # yt videos 🎶🎶🎶


2024 హోసన్నా మినిస్ట్రీస్ న్యూఇయర్ సాంగ్ #hosanna ministries #Telugu Christian songs #🎶🎶🎶🎶🎶

##christmas songs
#jesus songs
#christian songs
#hosanna ministries songs
#Andhra kraisthava keerthanalu
#2024 Hosanna ministries new year songs
#Telugu grace channel

ప్రేమపూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయశీలుడా
ఆపత్కాలమందున సర్వలోకమందున్న
దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా
ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా
ఆనందింతునీలో జీవితాంతము
నీ కృప ఎంత ఉన్నతమో‌ వర్ణించలేను స్వామి
నీ కృప యందు తుదివరకు నడిపించు యేసయ్య

పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము(2)
ఇహమందు పరమందు ఆశ్రమమైనవాడవు
ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నా ముందు నీవుంటే భయమే లేదయ్య(2)

భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి(2)
బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
భజియించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నా ముందు నీవుంటే భయమే లేదయ్య(2)

నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో
నా అంతరంగమందు నీవు కొలువైవున్నావులే(2)
నిర్మలమైన నీ మనసే నా అంకితం చేసావు
నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నా ముందు నీవుంటే భయమే లేదయ్య(2)

Trip.com WW

Scroll to Top