Athi Parishuddhuda | అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము |

Athi Parishuddhuda | అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము |


అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

☞ 🙂 Follow us on Facebook: https://www.facebook.com/EGC.Hyd/

☞ Daily Devotional Audio Messages 🎤 🔊 Playlists:
https://www.youtube.com/playlist?list…

☞ Hindi Worship Songs 🎶 Playlists:
https://www.youtube.com/playlist?list…

☞ English Worship Songs 🎶 Playlists:
https://www.youtube.com/playlist?list…

☞ Telugu Worship Songs 🎶 Playlists:
https://www.youtube.com/playlist?list…

☞ Subscribe for more content 👍 🔔

Lyrics:

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీ కోసమే
ఆశ్రయమైన నా యేసయ్యా
” అతి పరిశుద్ధుడా ”
సర్వోన్నతమైన స్థలముల యందు
నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము
ఎన్నడూ ఆశ్చర్యమే
ముందెన్నడూ చవి చూడని
సరిక్రొత్తదైన ప్రేమా మృతం
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణము తీరదు ఏనాటికీ. ” అతి పరిశుద్ధుడా ”

సద్గుణ రాశి నీ జాడలను
నా ఎదుటే నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం
నీ కృపకు సంకేతమే
కృప వెంబడి కృప పొందగా
మారాను మధురముగా నే పొందగా
నాలోన ఏ మంచి చూశావయ్యా
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా ” అతి పరిశుద్ధుడా ”

సారెపై నున్న పాత్రగ నన్ను
చేజారి పోనియ్యక
శోధనలెన్నో ఎదిరించినను
నను సోలి పోనియ్యక
ఉన్నావులే ప్రతి క్షణమునా
కలిసున్నావులె ప్రతి అడుగునా
నీవేగా యేసయ్య నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి ” అతి పరిశుద్ధుడా ”

Trip.com WW

Scroll to Top