Janminchinadu latest telugu Christmas song 2020

Janminchinadu latest telugu Christmas song 2020


Lyrics, Tune & Sung by Voola Soney

Music Programming by Sax Bunker

Recorded at GGM Studio’s Secunderabad
Mixing & mastering AG Studio’s Secunderabad
Keys Suresh, Dhol Job, Rhythms Ramesh

ప : జన్మించినాడు బేత్లెహేము పురమునందు
కన్నె మరియ గర్భమందున
ఇమ్మానుయేలు మన కొరకు పుట్టాడంటు
గొల్లలు ఙ్ఞానులు పరుగిడి వచ్చేరంట

అప: రారండోయ్ రారండీ రక్షకుడు జన్మించేను
దివిలోన దూతలు కొనియాడగ
రారండోయ్ రారండీ పరిశుద్ధుడు ఉద్భవించెను
మన పాపభారం తొలగింపగా ( 2 )

చ : నింగిలోని దూత సైన్యం
స్తోత్రగీతం వినిపించంగ
నిండియున్న చీకటంత తొలగిపోయె నీ రాకతో
భక్తితో ఆ బాలుని వేడ చూపించే ఒక తార జాడ
దేవాది దేవుడే దీనుడై ఉదయించే పాకలొ బాలుడై

అప: రారండోయ్ రారండీ రక్షకుడు జన్మించేను
దివిలోన దూతలు కొనియాడగ
రారండోయ్ రారండీ పరిశుద్ధుడు ఉద్భవించెను
మన పాపభారం తొలగింపగా ( 2 )

చ : యూదా దేశమున బేత్లెహేము గ్రామమున
దావీదు వంశమున ఉదయించెన్
ఆశ్చర్యకార్యములు చేయుటకు
ఆశ్చర్యకరునిగా అరుదించే
అశాంతి లో ఉన్న వారికీ సమాధానమీయ వచ్చెను
నిత్యత్వమునకు నడిపించును నిత్య జీవపు ఊటను త్రాగ నిచ్చును

అప: రారండోయ్ రారండీ రక్షకుడు జన్మించేను
దివిలోన దూతలు కొనియాడగ
రారండోయ్ రారండీ పరిశుద్ధుడు ఉద్భవించెను
మన పాపభారం తొలగింపగా ( 2 )

Trip.com WW

Scroll to Top