Lali Paatala Jola Paatala || Telugu Christmas Song
లాలి పాటల జోల పాటల – బాల యేసుని లాలన
మురిపాల బాలుని – దైవ సుతుని కన్న తల్లివిలే (2)
1. చల్లని ప్రభు దీవెన – నీ కడుపున పండెలే
చాలదా ఈ ధన్యత – నిన్ను ఎన్నిక చేసెలే(1)
పాప మెరుగని కన్నేవో- నిండు నెలలు మొస్తివి
ఎంత ధైర్యము తల్లిదో …
పావనాత్మను మోయుచు – యోసేపుతో నడిచావులే
ఓ సహనశీలి సుగుణరాసి నీకు జోహారు (2)
2. సిలువనే తను మోయగ – నడచినావు తోడుగా
ప్రేమకే నువు మాతృక కరుణకే కర దీపిక
పాపులను రక్షించగా కొడుకునే అర్పించగా
ఎంత త్యాగము తల్లిదో …
లోక మాత ఏలుకో శాంతి దూత జాలితో
ఓ త్యాగ మూర్తి తల్లి మరియ నీకు జోహారు(2)
¶లాలి¶


