
# తెలుగు క్రిస్మస్ సాంగ్స్#telugu christmas songs# తెలుగు క్రిస్టియన్ పాటలు#telugu Christian songs#

# తెలుగు క్రిస్మస్ సాంగ్స్#telugu christmas songs# తెలుగు క్రిస్టియన్ పాటలు#telugu Christian songs#
Edit with InShot: https://inshotshare.app
1.
వింతైన తారక వెలసింది గగనాన
వింతైన తారక వెలసింది గగనాన
యేసయ్య జన్మ స్థలము – చూపించు కార్యాన ||2||
జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
దైవమే పంపెనని గ్రహియించు హృదయాన ||2||
మనమంతా జగమంతా తారవలె క్రీస్తుని చాటుదాం
Happy Christmas – Merry Christmas – We wish you Happy Christmas…
1. ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే నిత్య మహిమ ||2||
భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మన||
2. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
యేసయ్యను దర్శించిరి – ఎంతో విలువైన కానుకలను
అర్పించి రారాజును పూజించిరి ||2||
హేరోదు పుర జనులకు శుభ వార్త చాటిరి
అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మన||
2.
రారె చూతము రాజ సుతుడీ రేయి జనన మాయెను (2)
రాజులకు రా రాజు మెస్సియ (2) రాజితంబగు తేజమదిగో (2) ||రారె||
1.దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2) ధరణి కరిగెనీ దినమున (2) ||రారె||
2.కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం (2)
తెల్లగానది తేజరిల్లెడి (2) తారగాంచరే త్వరగ రారే (2) ||రారె||
3.బాలుడడుగో వేల సూర్యల బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాల వృద్ధుల (2) నేల గల్గిన నాధుడు (2) ||రారె||
3.
బెత్లహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని (2) ||బెత్లెహేములో||
ఆకాశములో సందడి చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి మిల మిల మెరిసే సందడి (2) ||బెత్లెహేములో||
దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి (2)
గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి (2) ||బెత్లెహేములో||
దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి (2) ||బెత్లెహేములో||
4.
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని (2) ||తార||
మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార||
బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములే ఆ యింటిలో మా కంటితో
నిను కనులారా గాంచాములే (2) మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే ||తార|
5.
అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని
1. ప్రవచనాలు నెరవేరాయి శ్రమదినాలు ఇకపోయాయి (2),
విడుదల ప్రకటించే శిక్షను తప్పించే (2),
2. దివిజనాలు సమకురాయి ఘనస్వరాలు వినిపించాయి (2),
పరముకు నడిపించే మార్గము చూపించే (2),
3. సుమవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి (2),
ఇలలో నశియించే జనులను ప్రేమించే (2),
6.
ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడు
ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా
ఆ… అర్దరాత్రి కాలమందు వెన్నెల… ఆహా ఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా (2)
జన్మించినాడంట వెన్నెలా ఈ అవనిలోనంట వెన్నెలా (2) ||ఇళ్లలోన||
హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
ఆ… యూదా దేశమందు వెన్నెల… ఆహా
బెత్లెహేము పురమునందు వెన్నెల… ఆహా (2)
రాజులకు రాజంట వెన్నెలా
ఆ రాజు యేసంట వెన్నెల (2) ||ఇళ్లలోన||
ఆహ… తార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల… ఆహా
దర్శింప వచ్చినారు వెన్నెల… ఆహా (2)
బంగారు సాంబ్రాణి బోళం
తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2) ||ఇళ్లలోన||
ఆ… దివి నుండి ఈ భువికి వచ్చినాడు ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2) పాపులైన మనకోసం వెన్నెల… ఆహా
ప్రాణాన్ని అర్పించి వెన్నెల… ఆహా (2)
పరలోకానికి మార్గం వెన్నెలా
ఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా (2) ||ఇళ్లలోన||
హా.. పరలోకం చేరుటకై నేనేమి చెయ్యాలి కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
యేసయ్యను నమ్ముకో వెన్నెల… ఆహా
పాపాలను ఒప్పుకో వెన్నెల… ఆహా (2)
క్రొత్తగా జన్మించు వెన్నెలా
రక్షణను పొందుకో వెన్నెలా (2) ||ఇళ్లలోన||
7.
అందరు మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)
క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు||
సృష్టికర్తయే మరియ తనయుడై పశుల పాకలో పరుండినాడు (2)
నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు (2)
నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్||
ఇంటిని విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు (2)
తప్పును తెలిసి తిరిగి రాగా క్షమియించి కృప చూపినాడు (2)
ఎన్నో వరములు ఇచ్చాడు ||క్రిస్మస్||
పాత దినములు క్రొత్తవి చేసి నీలో జీవము నింపుతాడు (2)
కటిక చీకటే వేకువ కాగా అంబరమందు సంబరమాయే (2)
హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్||
8.
తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా – ఓ మరియమ్మా (2)
చుక్కను జూచి మేము వచ్చినాము మొక్కి పోవుటకు (2) ||తూర్పు దిక్కు||
బెత్లెహేము పురము లోని బాలుడమ్మా గొప్ప బాలుడమ్మా (2)
మన పాపముల బాప పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా (2) ||తూర్పు దిక్కు||
పశువుల పాకలోని బాలుడమ్మా పాపరహితుడమ్మా (2)
పాపంబు బాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా (2) ||తూర్పు దిక్కు||
బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము బాల యేసు నొద్దకు (2)
బంగారు పాదముల మ్రొక్కెదము బహుగ పాడెదము (2) ||తూర్పు దిక్కు||
9